క్రిష్-3 చిత్రంలో
హృతిక్‌రోషన్ ఎనిమిది పలకల దేహంతో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో షారూఖ్‌ఖాన్
కూడా ఇదే తరహాలో కనువిందు చేయబోతున్నాడు. ఈ ఇద్దరి బాటలో
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ కూడా ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో
ముంచెత్తబోతున్నాడని తెలిసింది. గతంలో వచ్చిన గజిని చిత్రంలో సిక్స్‌ప్యాక్
బాడీతో కనిపించిన ఆయన తాజాగా రాజ్‌కుమార్ హిరాణీ రూపొందిస్తున్న పీకే
చిత్రంలో ఎనిమిది పలకల దేహంతో కనిపించబోతున్నాడని చిత్ర వర్గాల సమాచారం.
ఇటీవల నాసిక్‌లోని గోదావరి నది ఒడ్డున చిత్రీకరించిన ఓ సన్నివేశంలో అమీర్
ఎనిమిది పలకల దేహంతో కనిపించాడని, సినిమాలో ఆయన పాత్ర చిత్రణ విభిన్నంగా
వుంటుందని తెలిసింది. దేవుడిని వెతుక్కుంటూ అంతరిక్షం నుంచి భూమిపై దిగే ఓ
గ్రహాంతర వాసిగా అమీర్‌ఖాన్ నటిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే
సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మూడు ప్రచార
చిత్రాల్ని విడుదల చేశారు. త్వరలో మరో ఏడింటిని రిలీజ్ చేయనున్నారని
బాలీవుడ్ వర్గాల సమాచారం.
0 comments:
Post a Comment