ప్రియమణి పెళ్లికి
సిద్ధమవుతున్నదనే వార్తలు తమిళ సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో చక్కటి స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేసి ఎన్నో చిత్రాల్లో నటించింది అలాగే జాతీయ
ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకున్న ఈ సుందరి ప్రస్తుతం అవకాశాలలేమితో
సతమతమవుతున్నది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని తమిళ
మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ ఛాయాగ్రహాకుడిని ప్రియమణి పెళ్లాడబోతుందని, వీరిద్దరి మధ్య రెండేళ్ల నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. అయితే ఈ పెళ్లి వార్తల్ని ప్రియమణి సన్నిహిత సినీ వర్గాలు ఖండించాయి. తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గినా కన్నడంలో ప్రియమణి నాలుగు చిత్రాల్లో నటిస్తోందని, ఇప్పుడే ఆమెకు వివాహం చేసుకునే ఆలోచన లేదని వారంటున్నారు. ఈ విషయంలో ప్రియమణి స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో చండీ తర్వాత మరే చిత్రంలో ప్రియమణి నటించలేదు.

0 comments:
Post a Comment