అజిత్‌తో చిత్రం చేయడానికి దర్శక నిర్మాత లింగుసామి రెడీ అంటున్నారని
సమాచారం. అయితే అందుకు అజిత్ ఓకే అంటారా? లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది.
లింగుసామి 2005లో అజిత్ హీరోగా జీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తరువాత
వారి కాంబినేషన్‌లో చిత్రం రాలేదు. లింగుసామి ఆ తరువాత నిర్మాతగా కూడా మారి
దీపావళి, పట్టాళం, పైయ్యా, వేట్టై, కుంకీ తదితర చిత్రాలుచేస్తూ వచ్చారు.
ఇటీవల సూర్య, హీరోగా అంజాన్ చిత్రాన్ని చేసిన లింగుసామి ప్రస్తుతం కమలహాసన్
హీరోగా ఉత్తమ విలన్, ఇడం పొరుళ్ ఏవల్, రజని మురుగన్ చిత్రాలను ఇతరుల
దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
కాగా ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న అజిత్ తదుపరి వీరం ఫేమ్ శివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు తన చిత్ర నిర్మాతల్ని తానే నిర్ణయిస్తూ వస్తున్న అజిత్ శివ దర్శకత్వం వహించే చిత్రానికి ఆయనే నిర్మాణ సంస్థను నిర్ణయించుకోమన్నారట. ఈ విషయం చెవిలో పడ్డ లింగుసామి అజిత్ చిత్రాన్ని నిర్మించడానికి తాను రెడీ అని దర్శకుడు శివతో చెప్పినట్లు సమాచారం. అయితే ఇందుకు అజిత్ అంగీకరిస్తారా? అన్న అంశం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

0 comments:
Post a Comment