పరదేశి వంటి చిత్రాల్లో తన నటనా ప్రతిభను నిరూపించుకున్న ఈ భామ ప్రస్తుతం
చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉంది. అలాగే తమిళం, తెలుగు, కన్నడం మొదలగు
మూడు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
దీని గురించి ఈ ముదుగుమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం తమిళంలో మంచి అవకాశాలు
లభిస్తున్నాయని చెప్పింది. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాల వివరాలు
తెలుపుతూ విళిత్తురు చిత్ర షూటింగ్ పూర్తయిందని తెలిపింది. ఇందులో తాను
స్లమ్ ఏరియా అమ్మాయిగా నటించానని చెప్పింది. తిరందిరుసిసే సస్పెన్స్
థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపింది. ఇది ఒక క్లబ్‌లో జరిగే కథా చిత్రం అని
పేర్కొంది.
ఇక కాత్తాడి చిత్రంలో యాక్షన్ హీరోయిన్‌గా అవతారమెత్తుతున్నానని వెల్లడించింది. తదుపరి సముద్రకని దర్శకత్వంలో రూపొందనున్న త్రిభాషా (తమిళం, తెలుగు, కన్నడం) చిత్రం కిట్టా చిత్రంలో నటించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో నాలుగు గెటప్‌ల్లో కనిపించనున్నట్లు చెప్పింది. అదేవిధంగా ఛాయా గ్రాహకుడు డేని దర్శకత్వంలో మాల్ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపింది. ఈ చిత్రం తెలుగులో కూడా తెరకెక్కనుందని వెల్లడించింది. అదే విధంగా త్వరలో ఒక హాలీవుడ్ చిత్రంలోనూ నటించనున్నట్లు, ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని ఆమె వివరించింది. తానిప్పుడు పలు చిత్రాల్లో నటిస్తున్నా కాల్‌షీట్స్, సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నట్లు దన్సిక చెప్పింది.

0 comments:
Post a Comment