Saturday 3 January 2015

ఫిబ్రవరి మెుదటి వారంలో టెంపర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్‌‌ట ప్రొడక్షన్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ టెంపర్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్‌‌ట టీజర్‌ నూతన సంవత్సర కానుకగా  విడుదలైంది. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర అంటూ ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్‌తో విడుదల చేసిన ఈ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.  ఈ సినిమాలో ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా, ఎంతో పవర్‌ఫుల్‌గా వుంటుంది. ఈ సినిమా బేనర్‌ ప్రతిష్ఠను మరింత పెంచే సినిమా అవుతుంది.

 ఈనెల 20 వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. మరో పక్క పోస్‌‌ట ప్రొడక్షన్‌ వర్‌‌క శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మెుదటి వారంలో వరల్‌‌డవైడ్గగా రిలీజ్‌ చేయబోతున్నారు . యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ హీరోరుున్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనిెకళ్ళ భరణి, ఆలీ, పోసాని కౄఎష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాపభ్ర, పవిత్ర లోేకష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యావ్గు ెక.నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్‌‌ట: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

0 comments:

Post a Comment