Monday, 8 December 2014

అవును..ప్రేమలో వున్నాను - అనుష్కశర్మ

విరాట్‌కోహ్లితో తాను ప్రేమలో వున్నట్లు బాలీవుడ్ నటి అనుష్కశర్మ ప్రకటించింది. అయితే ప్రేమ అనేది తన వ్యక్తిగత విషయమని, మీడియా సమావేశాల్లో ఆ ప్రస్తావన తీసుకురావొద్దని కోరింది. ప్రస్తుతం తన తాజా చిత్రం పీకే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా వున్న ఈ సుందరి మాట్లాడుతూ నా జీవితంలో రహస్యాలేమీ లేవు. గతకొంతకాలంగా విరాట్‌తో ప్రేమలో వున్నాను. ఈ విషయం అందరికీ తెలుసు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో వ్యక్తిగత విషయాల గురించి అడగటం భావ్యం కాదు.

మా ప్రేమ వ్యవహారాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌లా భావించరాదు అని చెప్పింది. పెళ్లెప్పుడన్న ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం మేమిద్దరం కెరీర్‌లో మంచి స్థాయిలో కొనసాగుతున్నాం. నాలోని నటిని సంతృప్తిపరిచే పాత్రలు మరిన్ని చేయాలనుకుంటున్నాను. విరాట్ కూడా క్రికెట్‌లో ఇంకా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాల్సివుంది. మరో రెండేళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచన లేదు అని చెప్పింది.

0 comments:

Post a Comment