Thursday 25 December 2014

సమీక్ష : ‘ముకుంద’

తెలుగు పోస్టర్  రేటింగ్ : 2.5/5

ఆరడుగుల ఎత్తు, చక్కని రూపం, అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకునే అందంతో వరుణ్ తేజ్ తొలిచూపులోనే ఆకర్షించాడు. దాంతో ‘ముకుంద’ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెడ్గే ఈ సినిమాలో కధానాయిక. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ‘ముకుంద’ను నిర్మించారు. 


కథ :
ముకుంద(వరుణ్ తేజ్) మార్కెట్ యార్డులో ఉల్లిపాయలు అమ్ముకునే ఒక సామాన్య వ్యాపారి కొడుకు. తన స్నేహితుడు అర్జున్ స్థానిక మున్సిపల్ చైర్మెన్ (రావు రమేష్) తమ్ముడి కూతురిని ప్రేమిస్తాడు. అర్జున్ కు మున్సిపల్ చైర్మెన్ & వారి గుండాల నుండి ఎటువంటి ఆపద లేకుండా కాపాడుతుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు మున్సిపల్ చైర్మెన్ కూతురు పూజా హెడ్గేను చూసి ప్రేమిస్తాడు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. 25 సంవత్సరాల నుండి ఎన్నికలలో రావు రమేష్ దే విజయం. అధికార బలం చూసుకుని అహంకార పూరిత ధోరణితో వ్యవహరిస్తున్న రావు రమేష్ ఆగడాలకు ముకుంద అడ్డుకట్ట వేయలనుకుంటాడు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా చికాకు తెప్పిస్తున్న ‘ముకుంద’ అడ్డు తొలగించుకోవాలని రావు రమేష్ ప్రణాళికలు రచిస్తాడు.
ఈ సంగ్రామంలో ఎవరు విజయం సాదించారు..? రావు రమేష్ పై మున్సిపల్ ఎన్నికలలో ‘ముకుంద’ & కో విజయ కేతనం ఎగురవేశారా..? లేదా..? తను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకున్నాడా..? లేదా..? అనేది మిగతా కథ.

 హీరో పాత్రకు డైలాగులు చాలా తక్కువ. కళ్ళతోనే చాలా భావాలు పలికించాడు వరుణ్ తేజ్. హీరో స్మైల్, లుక్స్ తదితర అంశాలను ఎలివేట్ చేసేలా కథను రాసుకున్నారు. ముఖ్యంగా వరుణ్ హైట్ కు తగ్గట్లు ఫైట్స్ ను డిజైన్ చేశారు. యాక్షన్ సన్నివేశాలలో హీరో పెర్ఫార్మన్స్ బాగుంది. చిరంజీవి పెట్టిన ‘మెగా ప్రిన్స్’ బిరుదుకు వరుణ్ తేజ్ తొలి సినిమాతో న్యాయం చేశాడు.ప్రతి సినిమాలో కాస్త అతి చేసే రావు రమేష్ ఈ సినిమాలో సెటిల్ పెర్ఫార్మన్స్ చేశారు. వరుణ్ తేజ్, రావు రమేష్ మధ్య సన్నివేశాలు బాగున్నాయి. కీలకమైన పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ తెరపై కనిపించింది కొద్ది సమయమే అయినా తన డైలాగులు, పెర్ఫార్మన్స్ బాగున్నాయి.

 ‘ముకుంద’ టైటిల్, సాంగ్స్ చూసి సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. హీరో హీరోయిన్ల మధ్య లవ్, రొమాంటిక్ సన్నివేశాలు కాదు కదా, కనీసం మాటలు కూడా లేవు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లవ్ ట్రాక్ హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ను డామినేట్ చేసింది. హీరోయిన్ ను కేవలం పాటలకు పరిమితం చేసేశారు. హీరోకి స్నేహితుడు అర్జున్ అంటే ఎందుకు అంత ఇష్టమో..? హీరో లక్ష్యం ఏంటో..? సరిగా చూపించలేదు. సినిమాకు సరైన ముగింపు ఇవ్వలేదు.
 తెలుగు పోస్టర్  రేటింగ్ : 2.5/5

0 comments:

Post a Comment