తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ
‘బొమ్మరిల్లు’ హీరో, మాస్ హీరోగా కావాలని చేసిన ప్రయత్నాలు
బెడిసికొట్టాయి. వరుసగా ప్లాప్ సినిమాలు పలకరిస్తుండడంతో తమిళ ఇండస్ట్రీకి
చెక్కేశాడు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుని, కొత్త తరహా సినిమాలతో
హిట్ ట్రాక్ ఎక్కాడు.
మాతృభాష తమిళంలో యువ హీరో సిద్దార్థ్ మరో హిట్ కొట్టాడు. సిద్దార్థ్ నటించిన ‘కావ్య తలైవన్’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న భగవతార్ అనే పాత్రలో సిద్దూ నటించాడు. విమర్శకులు అతని నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమా విజయంతో సిద్దార్థ్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. వరుసగా సిద్దార్థ్ కు ఇది రెండవ విజయం. ఈ హీరో నటించిన చివరి తమిళ సినిమా ‘జిగార్తాండ’ కూడా హిట్ అయ్యింది.
తమిళంలో విజయం సాధించిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసే అలవాటు ఉన్న మన నిర్మాతలు.. ఎందుకో సిద్దార్థ్ సినిమాలను పట్టించుకోవడం లేదు. దాంతో ఇక్కడ హిట్ కొట్టాలనే సిద్దార్థ్ కోరిక నెరవేరడం లేదు.

0 comments:
Post a Comment