టాలీవుడ్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న టాలీవుడ్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ పీరియాడిక్ మూవీలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమై, ఒక సంవత్సరం పై నుంచి సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుందని సమాచారం. ఇటివలే రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నారు.
కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు, ఈ చిత్ర టీం డిసెంబర్ నెలలో ఒక లాంగ్ షెడ్యూల్ కోసం బల్గేరియా వెళ్లనున్నారని ఇదివరకే తెలియచేసము. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తవుతుందని టీం సభ్యులు చెబుతున్నారు. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సెకండ పార్ట్ ని కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చెయ్యనున్నారు.
ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు.
0 comments:
Post a Comment