Wednesday 1 October 2014

కమల్‌హాసన్ ‘పాపనాశమ్’.

ప్రస్తుతం కమల్  నటిస్తున్న రీమేక్ ‘పాపనాశమ్’. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ ఈ చిత్రానికి మాతృక. ఇప్పటికే ఈ కథ తెలుగులో వెంకటేశ్ హీరోగా, కన్నడంలో రవిచంద్రన్ హీరోగా రీమేక్ అయ్యింది. ఇక మిగిలింది తమిళమే. ప్రమాదంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఆ ఇంటిపెద్ద ఎలా ఒడ్డుకు చేర్చాడన్నదే ఈ సినిమా కథ.

 ఇందులో కమల్‌కి జోడీగా గౌతమి నటిస్తుండటం విశేషం. కమల్-గౌతమిది ఒకప్పుడు సూపర్‌హిట్ కాంబినేషన్. విచిత్రసోదరులు, క్షత్రియపుత్రుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ జంట ఆకట్టుకుంది. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట మళ్లీ ఇన్నాళ్లకు తెరను పంచుకోవడం విశేషం. మాతృక దర్శకుడైన జీతూ జోసఫ్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్, వెంకటేశ్, రవిచంద్రన్ తమ పరిథి మేరకు ఈ పాత్రను అద్భుతంగా రక్తికట్టించారు. ఇప్పుడు కమల్ వంతు వచ్చింది. ఇటీవలే ‘పాపనాశమ్’ స్టిల్స్‌ని మీడియాకు విడుదల చేశారు. వాటిలో కమల్ ఆహార్యం, హావభావాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

0 comments:

Post a Comment