Wednesday 1 October 2014

బిపాసబసు సవాల్!

ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలోనే మలయాళ నటుడు మమ్ముట్టి పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలను నాటాలంటూ మై ట్రీ ఛాలెంజ్ పేరుతో ఇటీవల ఓ కొత్త పోటీని తెరపైకి తీసుకొచ్చారు.

తాను స్వయంగా కొన్ని మొక్కల్ని నాటడమే కాకుండా ఆ పనిని చేపట్టాల్సిందిగా సూర్య, ఫహాద్ ఫాసిల్ తో పాటు పలు భాషలకు చెందిన నటీనటులకు సవాల్ విసిరారు మమ్ముట్టి. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారి జాబితాలో బాలీవుడ్ సుందరి బిపాసబసు చేరింది. ప్రస్తుతం ఎలోన్ సినిమా చిత్రీకరణతో బిజీగా గడుపుతున్న ఈ భామ షూటింగ్ లొకేషన్‌లో ఓ మామిడి మొక్కను నాటిందట. తనలా మొక్కలు నాటాల్సిందిగా కథానాయకులు మోహన్‌లాల్, హృతిక్‌రోషన్‌లకు ఛాలెంజ్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. ఈ శృంగార భామ సవాల్‌ను ఇద్దరు హీరోలు స్వీకరిస్తారో? లేదో? చూడాలి మరి.

0 comments:

Post a Comment