Monday, 27 October 2014

సన్నీ లియోన్‌కు ఇమ్రాన్ హష్మీ నో..

బాలీవుడ్ ముద్దుల పేరు వింటేనే వెంటనే గుర్తుకువచ్చే హీరో ఇమ్రాన్ హష్మీకానీ ఏమొచ్చిందో ఏమో! సన్నీ లియోన్‌తో నటించేందుకు నో చెప్పేశాడు. ఇమ్రాన్ తదుపరి చిత్రం ‘ఉంగ్లీ’లో ఒక ఐటెమ్ సాంగ్‌లో సన్నీ లియోన్‌తో కలసి స్టెప్పులు వేయాలని చిత్ర నిర్మాతలు కోరితే, నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అడల్ట్‌స్టార్‌తో నటించేది లేదంటూ నిర్మాతలకు తెగేసి చెప్పేశాడు. దీంతో ఈ ఐటెమ్ సాంగ్ కోసం నిర్మాతలు ఇంటర్నేషనల్ మోడల్స్ వెతుకులాటలో పడ్డారు.

0 comments:

Post a Comment