Monday, 27 October 2014

జీవితాన్నిచ్చిన నటుడు అజిత్

 అజిత్‌కు ఇతరులకు సహాయం చేసే గుణం ఆది నుంచి అలవడిందని పేర్కొనవచ్చు. నేటి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కూడా తనకు జీవితాన్నిచ్చిన నటుడు అజిత్‌నేనంటారు. ఈయన తొలి చిత్రం హీరో అజిత్‌తోనే చేశారు. వీరి కలయికలో వచ్చిన దిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఏఆర్ మురుగదాస్ విజయ్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం కత్తి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 దీంతో తదుపరి ఈ దర్శకుడి చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయన్న విషయాన్ని  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి మురుగదాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను సహాయ దర్శకుడిగా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు దర్శకుడిగా అవకాశం కల్పించి జీవితాన్ని ప్రసాదించిన నటుడు అజిత్ అని వెల్లడించారు.

0 comments:

Post a Comment