Thursday, 16 October 2014

రజని కొత్త సినిమా కన్నడ పాత సినిమా రీమేక్?

బెంగళూర్‌లో బస్ కండక్టర్‌గా చేసినప్పుడు అప్పట్లో ఆయన కన్నడ చిత్రాలను చూస్తుండేవారట. అలా చూసినవాటిలో స్వర్గీయ కన్నడ రాజ్‌కుమార్ నటించిన ‘బంగారద మనుష్య’ ఒకటి. 1972లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రాన్ని ఎప్పటికైనా రీమేక్ చేయాలని రజనీ ఆలోచన. రాజ్‌కుమార్ చేసిన పాత్ర విపరీతంగా నచ్చిందని, ఆ పాత్రచేయాలని రజనీకి ఉందని ఆయన ఆప్తమిత్రుడు రాజ్ బహదూర్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. వాస్తవానికి ‘లింగా’కన్నా ముందే రజనీ ఈ చిత్రంలోనే నటించాల్సి ఉందట.

 అయితే అప్పటికే ‘లింగా’కి డేట్స్ కేటాయించేయడంతో ఆ రీమేక్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారని బహదూర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘లింగా’ తర్వాత రజనీ నటించే చిత్రం ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘లింగా’కి దర్శకత్వం వహిస్తున్న కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే రజనీకి ఈ సినిమా చేయాలని ఉందట. ఏదేమైనా, నలభై ఏళ్ల క్రితం చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయాలని రజనీ అనుకుంటున్నారంటే.. అదెంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

0 comments:

Post a Comment