Wednesday 8 October 2014

విశాల్ పూజ ఈ నెల 22న

విశాల్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం పూజ. హరి దర్శకుడు. శృతిహాసన్ కథానాయిక. ఈ నెల 22న ప్రేక్షుకుల ముందుకురానుందీ చిత్రం. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ప్రేమ, వినోదం, కుటుంబ బంధాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. యాక్షన్ అంశాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు హరి ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా కూడా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది అని అన్నారు. 
ఇక కథ విషయానికి వస్తే అవసరమైతే హ్యాండు..లేకపోతే మైండ్ వాడటం ఆ యువకుడి నైజం. అటువంటి అతడికి వృత్తిలో, ప్రేమలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని అధిగమించే క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులేమిటి? తన బుద్ధిబలంతో ఆ సమస్యల్ని అతడు ఏ విధంగా పరిష్కరించాడు? తన ప్రేమను ఎలా గెలుపించుకున్నాడు? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు విశాల్.


0 comments:

Post a Comment