Wednesday 8 October 2014

జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ...


జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో విల్లన్లతో పైట్స్ అంటేనే ఒక రేంజ్ లో ఉంటాయి ఇక ఆయన ఒంటిపై ఖాకీ చొక్కా వుంటే ఆ జోరు ఏ రేంజ్‌లో వుంటుందో ఇక చెప్పనవసరం లేదు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టెంపర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా సమాచారం. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.ఇందులో ఆయన పాత్ర చిత్రణ వినూత్న పంథాలో సాగుతుందని తెలిసింది. కర్తవ్య నిర్వహణనే ప్రాణంగా భావించే అధికారిగా ఆయన డైలాగ్స్, బాడీలాంగ్వేజ్ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెబుతున్నారు.

ఎన్టీఆర్ పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ సినిమా పూర్తికాగానే సుకుమార్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ చెప్పిన కథ నచ్చడంతో ఇటీవలే ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో ఆయన పాత్ర విలక్షణ రీతిలో వుండబోతున్నట్లు సమాచారం. దీనితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్.  

0 comments:

Post a Comment