Tuesday 16 September 2014

రానాకు జోడీగా శృంగార తార సన్నీలియోన్ ...

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ సినిమాల జోరును పెంచుతోంది. ఒక సినిమా తర్వాత మరొకటి వరుసగా చిత్రాల్ని అంగీకరిస్తూ రేసులో దూసుకుపోతోంది. హీరోయిన్‌గానే కాకుండా ప్రత్యేక గీతాల్లోనూ అలరిస్తున్న ఈ సుందరి తాజాగా హిందీలో మరో క్రేజీ ప్రాజెక్టుకు ఒకే చెప్పింది. రానా దగ్గుబాటి కథానాయకుడిగా వన్ నైట్ స్టాండ్ పేరుతో బాలీవుడ్‌లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాస్మిన్ డిసౌజా దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ కథానాయికగా ఎంపికైంది.

ఫాంటసీ, డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ చలాకీ అమ్మాయిగా ఓ వైవిధ్యమైన పాత్రలో నటించనుంది. అనుకోని పరిస్థితుల్లో ఒక రాత్రి కథానాయకుడితో ఏర్పడిన పరిచయం ఆమె జీవితాన్ని ఏ విధమైన మలుపులు తిప్పుతుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బ్లాక్ గుజారీష్ చిత్రాల ఫేమ్ భవానీ అయ్యర్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. నవంబర్‌లో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కథానుగుణంగా సినిమాను విదేశాల్లో తెరకెక్కించబోతున్నామని దర్శకురాలు తెలిపారు. తెలుగులో కరెంటుతీగ హిందీలో మస్తీజాదే లీలా టీనా అండ్ లోలో చిత్రాల్లో నటిస్తోంది సన్నీలియోన్.

0 comments:

Post a Comment