Tuesday 16 September 2014

పురాతన గుడి తాలూకు రహస్యాన్ని ఎలా ఛేదించాడన్నదే కార్తీకేయ చిత్ర ఇతివృత్తం

ప్రశ్నని ప్రశ్నలా వదిలేయడం కంటే ప్రాణాలొదిలేయడం బెటర్ అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఓ ధైర్యవంతుడైన యువకుడు ఓ పురాతన గుడి తాలూకు రహస్యాన్ని ఎలా ఛేదించాడన్నదే కార్తీకేయ చిత్ర ఇతివృత్తం అన్నారు చందు మొండేటి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కార్తీకేయ. నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్నారు. మాగ్నస్ సినీప్త్రెమ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో ఉన్న ఓ పురాతన ఆలయం నేపథ్యంలో నడిచే కథ ఇది. ఆ గుడి తలుపులు మూసి వుంచడం వెనకున్న రహస్యమేమిటి? ఆలయంలోని మార్మిక శక్తులేమిటి?అనే ఆసక్తికర విషయాల శోధనతో కథ సాగుతుంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు వైద్యవిద్యార్థులుగా కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది అన్నారు. తనికెళ్ల భరణి, రావు రమేష్, కిషోర్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ ఘట్టమనేని, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, సమర్పణ: శిరువూరి రాజేష్‌వర్మ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.

0 comments:

Post a Comment