Monday 15 September 2014

’బాహుబలి’ క్రికెట్ మ్యాచ్ !

టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు రాజమౌళి. జక్కన్న సినిమా అంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు నిర్భయంగా థియేటర్ కు వెళ్తున్నారు. అటు అగ్ర హీరోలు కూడా కాల్షీట్లు కట్టిపెట్టి మరీ డేట్లు అడ్జస్ట్ చేసి నటించేందుకు సిద్దం అవుతున్నారు. జక్కన్నకు వున్న క్రేజ్ అలాటింది. సినిమాలు తీయటమే కాదు.. వాటి విడుదల, ప్రమోషన్లలో కూడా జక్కన్నది డిఫరెంట్ స్టయిల్. తాజాగా, బాహుబలి కోసం క్రికెట్ ఆడునున్నాడు. సినిమాలో హీరో, విలన్ల మద్య పోరులా.. ఇక్కడ కూడా హీరోలు, విలన్లు పోటి పడుతున్నారు. బాహుబలి సినిమా హీరో ప్రభాస్, విలన్ రానాతో టీంను ఏర్పాటు చేశాడు జక్కన్న. రెండు టీంల మద్య మ్యాచ్ పెట్టి.. దాన్ని వీడియో తీసి ఎడిటింగ్ చేసి ప్రమోషన్ గా విడుదల చేస్తారట. ఇప్పటికే బాహుబలి ప్రోమోలకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీనికి తోడు.. బాహుబలి క్రికెట్ మ్యాచ్ తోడైతే.. ప్రమోషన్ బంపర్ హిట్.. మూవీ సూపర్ హిట్ కావడం ఖాయం.

0 comments:

Post a Comment