Monday 15 September 2014

వి.వి.వినాయక్ దర్శకత్వం లో అఖిల్..?


అక్కినేని అఖిల్..ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో మారుమోగుతుంది..గత కొంత కాలంగా అఖిల్ హీరోగా ఎంట్రి ఇవ్వబోతున్నాడు అంటూ, త్రివిక్రమ్, పూరి, శ్రీకాంత్ అడ్డాల ఇలా కొందరి ప్రముఖ దర్శకుల జాబితాలో అఖిల్ ఎంట్రి ఇవ్వబోతున్నాడు అంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి.. తాజాగా మరో మాస్ డైరెక్టర్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది..అయిన మరోవారు కాదు వివి. వినాయక్. యాక్షన్ సినిమాలు తీయడం లో బాగా పేరు ఉన్న దర్శకుడు ‘వివి. వినాయక్’. గతంలో నితిన్, ఎన్టీఆర్, రవి తేజ తాజాగా బెల్లం కొండా సురేష్ కొడుకు శ్రీనివాస్ ని కూడా ఇండస్ట్రీ కి మాస్ హీరోలుగా పరిచయం చేసి సక్సెస్ పొందాడు..ఇప్పుడు అదే కోవలో అక్కినేని అఖిల్ కూడా తెలుగు తెర కు పరిచయం చెయ్యాలని నాగార్జున వినాయక్ ని కోరాడట..అందుకు వినాయక్ కూడా ఒకే చెప్పాడని, ఈ న్యూస్ అధికారికంగా అక్కినేని నాగేశ్వర రావుగారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 20 న ప్రకటన చేయనున్నాడని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు..అంతే కాకుండా నాగ చైతన్య నటిస్తున్న ‘ఒకలైలాకోసం’ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని, మనం సినిమా 100 రోజుల వేడుకను సైతం ఘనంగా శిల్పకళా వేదికలో ఈ వేడుక నిర్వహించనున్నారని సమాచారం.

0 comments:

Post a Comment