Monday 15 September 2014

నటన రాదన్న వారిచేతనే మంచి నటిని అని పిలిపించుకున్నాను

సినీ పరిశ్రమలో నెంబర్‌వన్ హోదాలో వున్న కథానాయికకు లభించే దర్జా, గుర్తింపు వేరుగా వుంటాయి. అందుకే ఆ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలని ప్రతి నాయిక కలలు కంటారు. అయితే ఆ స్థాయిని చేరుకోవడం అంత సులువైన విషయమేమీ కాదని అంటోంది బాలీవుడ్ సొగసరి దీపికా పదుకునే. దాని వెనుక ఎంతో కృషి, తపన దాగివుంటుందని చెబుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస విజయాలతో జోరు మీదుంది ఈ సుందరి. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్రకథానాయిక హోదాను సొంతం చేసుకుంది.

ఆమె మాట్లాడుతూ నాయికగా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశాను. మొదట్లో నాకు అసలు నటన గురించే తెలియదని, సినిమాలకు నేను పనికిరానని చాలా మంది నా ముఖం ముందే చెప్పేవారు. నా భావాలకు, ఆలోచనలకు ఏ మాత్రం విలువనిచ్చే వారు కాదు. అలాంటి సందర్భం ఎదురైన ప్రతిసారి సినీ రంగం నుంచి తప్పుకుందామని అనిపించేది. అయితే ప్రతికూలతల్ని సవాల్‌గా స్వీకరించాను. నాకు నటన రాదన్న వారిచేతనే మంచి నటిని అని పిలిపించుకున్నాను. ఇప్పుడు నెంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాను. అయితే ఈ స్టార్ హోదాను జీవితాంతం నిలుపుకోవడం కష్టమే. అందుకే ఎలాంటి అనవసర ఆలోచనలు పెట్టుకోకుండా ప్రతి సినిమాలో ఉత్తమైన నటనను కనబర్చడానికి ప్రయత్నిస్తాను అని తెలిపింది.

0 comments:

Post a Comment