రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ఈరోజు (శనివారం) ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ
సమావేశంలో పలు రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ప్రధానంగా.. విద్యుత్, ప్రాణహితకు ప్రత్యేక హోదా, హైకోర్టు విభజనపై
వినతులను చేయనున్నారు. కేసీఆర్ తో పాటుగా ప్రధానిని కలసిన వారిలో.. పార్టీ
ఎంపీలు కే.కేశవరావు, వినోద్, కవిత.. తదితరులు వున్నారు. ప్రధానితో భేటీ
అనంతరం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మరికొంత మంది కేంద్ర
మంత్రులతోనూ సమావేశం కానున్నారు.


00:54
Unknown

Posted in:
0 comments:
Post a Comment