Friday, 9 January 2015

సమీక్ష : గోపాల గోపాల


 తెలుగుపోస్టర్. కామ్ రేటింగ్ : 3.5/5

ఏడాదిగా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ను తెర ఫై చూస్తామా  అనుకున్న ఫాన్స్ కు ఈరోజు ప్రీమియర్ షో తో ఆ కోరిక తీరిపోయింది. అర్ధరాత్రి నుండే థియేటర్స్ దగ్గర అబిమానుల సంబరాలు మొదలయ్యాయి. హైదరాబాద్ , విశాఖ వంటి జంట నగరాల్లో పవన్ , విక్టరీ అబిమానులు థియేటర్స్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ప్రీమియర్ షో కి అద్బుత మైన స్పందన వచ్చింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మల్టీ స్టారర్ మూవీ అభిమానులనే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది

ఇక సినిమా విషయనికి వస్తే అభిమానులు దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గోపాలుడిగా, నిజజీవితంలో భక్తుడైన వెంకటేష్ నాస్తికుడైన గోపాల రావు పాత్రలో నటించిన క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు మూడు రోజుల ముందే బోగి, సంక్రాంతి పండుగలు ఈ సినిమా రిలీజ్ తో మొదలైంది. భారీ అంచనాల నడువ ఈ రోజు విడుదలైన ఈ సినిమా షూటింగ్  మొదలైన నాటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులు, అభిమానుల అంచనాలను ‘గోపాల గోపాల’ ఎంతవరకూ అందుకుంది......

కథ :
ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి గోపాల్ రావు(వెంకటేష్). స్వతహాగా గోపాల్ రావు నాస్థికుడు. కానీ తను చేసేది మాత్రం దేవుడి బొమ్మలను, విగ్రహాలను అమ్మడం. ఆ విగ్రహాలను అమ్మడంలో మాత్రం దేవుళ్ళ పేర్లను, ప్రజల మూడ నమ్మకాలను బాగా వాడుకుంటూ ఉంటాడు. అప్పుడే గోపాల్ రావు ఉండే ఏరియాలో సంభవించిన భూకంపం వల్ల గోపాల్ రావు షాప్ మొత్తం కూలిపోతుంది. దాంతో తన షాప్ పేరు మీద చేసిన ఇన్స్యూరెన్స్ ని ఇమ్మని గోపాల్ రావు కోరతాడు. కానీ ఆ నష్టం గాడ్ అఫ్ యాక్ట్ అనే దాని వల్ల జరిగిందని, అలా జరిగితే ఇన్సూరెన్స్ ఇవ్వరని చెప్పడంతో గోపాల్ రావు తనకు నష్టం చేసిన దేవుడిపై కేసు వేస్తాడు.
ఆ కేసులోకి మేము దైవాంస సంభూతులం అని చెప్పుకుంటూ స్వామీజీలుగా పేరు తెచ్చుకున్న లీలాధర (మిథున్ చక్రవర్తి), గోపిక మాత(దీక్ష పంత్), సిద్దేశ్వర మహారాజ్(పోసాని కృష్ణ మురళి)లను ఇన్వాల్వ్ చేస్తాడు. గోపాల్ రావు చేసిన పనికి అతన్ని చంపడానికి ఈ స్వామీజీలు ట్రై చేస్తున్న టైంలో గోవింద గోపాల హరి అలియాస్ శ్రీ కృష్ణుడు(పవన్ కళ్యాణ్) ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన గోపాల గోపాల్ రావుకి ఎలా సాయం చేసాడు.? అసలు నాస్తికుడైన గోపాల్ రావు దగ్గరకి కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు.? దేవుని మీద వేసిన కేసులో గోపాల్ రావు గెలిచాడా.? లేదా.? గోపాల్ రావుని అడ్డుకోవడం కోసం లీలాధర, గోపిక మాత, సిద్దేశ్వర మహారాజ్ లు ఏమేమి చేసారు.? ఈ గోపాల్ రావు – గోపాలుడి కాంబినేషన్ ఎలా ఉందనేది.? మీరు వెండితెరపైనే చూడాలి..


ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది, సినిమాకి ప్రాణం పోసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాకి హైలైట్ గా నిలిచేది పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ అక్కడ వారిమధ్య వచ్చే సీన్స్, ఆ తరువాత సెకండాఫ్ లో వారిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ నవ్విస్తూనే, వాళ్ళని ఎంతో ఆలోచించేలా చేస్తాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులకు, ముఖ్యంగా అభిమానులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. మోడ్రన్ శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం, డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, ఆ పాత్రకి రాసిన డైలాగ్స్ అన్నీ హైలైట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ లుక్ అండ్ పెర్ఫార్మన్స్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒక దేవుడి పాత్రలో పవన్ వేసే కొన్ని పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఇక నాస్తికుడిగా వెంకటేష్ నటన బాగుంది. ఆయన పాత్ర సినిమాలో ఎక్కువ సేపు ఉంటుంది. ముఖ్యంగా కోర్టు సీన్స్ లో వెంకటేష్ వేసిన సెటైర్స్, పవన్ కళ్యాణ్ తో వెంకీ వేసే పంచ్ లు చూసే ఆడియన్స్ లో ఒక కొత్త ఫీలింగ్ ని కలిగిస్తాయి. ముఖ్యంగా వెంకటేష్ పవన్ ని తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ వచ్చే సీన్స్ బాగున్నాయి.

ఇక చెప్పుకోవాల్సింది బాబాజీగా చేసిన పోసాని కృష్ణ మురళి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసాడు. వెంకటేష్ – పోసాని కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా నవ్వు తెప్పిస్తాయి. బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి లీలాధర స్వామీజీ పాత్రలో జీవించాడు. ఆయనకి డైలాగ్స్ తక్కువ ఉన్నా అతని పాత్ర మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. కృష్ణుడు, దీక్ష పంత్, రంగనాథ్, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, మధు శాలిని వీళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక ఈ సినిమా టాప్ హైలైట్స్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్, పవన్ – వెంకీ కాంబినేషన్ లో వచ్చే ఘటోత్కచుని సీన్, కోర్ట్ సీన్, క్లైమాక్స్ ఎపిసోడ్. ఇక వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చే ‘భజే భాజే’ సాంగ్ చూసే ప్రేక్షకులకి కన్నుల పండుగగా ఉంటుంది.

తెలుగుపోస్టర్. కామ్ రేటింగ్ : 3.5/5

Sunday, 4 January 2015

వెంకటేష్ బ్రదర్ లాంటివాడు: పవన్ కళ్యాణ్

హీరో వెంకటేష్ తనకు సోదరుడు లాంటి వాడని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన గోపాల గోపాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకటేష్, పవన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.... తాను వ్యక్తిగతంగా కలుసుకునే వ్యక్తుల్లో వెంకటేష్ ఒకరని చెప్పారు. సినిమాల గురించి తాము చాలా తక్కువగా మాట్లాడుకుంటామన్నారు. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయన్నారు. ఈ టాపిక్కే తామీ సినిమా చేయడానికి కారణమన్నారు.

వెంకటేష్ తో కలిసి చాలాసార్లు సినిమా చేయాలనుకున్నా ఇప్పటికి కుదిరిందన్నారు. చాలా భయంతో భగవంతుడి పాత్ర చేశానని అన్నారు. ఏమైనా పొరపాట్లు చేసివుంటే క్షమించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

'ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా'

దేవుడంటే తనకు చాలా భయమని హీరో పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నమ్మే దేవుడికి ఆకారం లేదని, నిరాకారుడైన దేవున్ని సంపూర్తిగా నమ్ముతానని వెల్లడించారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన 'గోపాల గోపాల' సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో వెంకటేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
'చిన్నప్పటి నుంచి ఏమవ్వాలో తెలిసేదికాదు. చదవు పెద్దగా చదవలేదు. ఏమయ్యాలో తెలియక నేను, నా స్నేహితుడు ఆనందసాయి శ్రీశైలం అడువుల్లోకి పారిపోదామనుకున్నాం. అప్పుడే హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. వెంటనే బయలుదేరి హైదరాబాద్ రమ్మన్నారు. సాయిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాను. ధ్యానం, యోగ నేర్చుకున్నాను, అందులోపడి మొత్తం బాధ్యతలు వదిలేశాను.

ఇంట్లో అన్నయ్యకు కథలు చెబుతుండేవాడిని. సంపాదించే అన్నయ్య, అమర్చిపెట్టే వదిన ఉంటే ఎన్నికథలైనా చెబుతావని అన్నయ్య అన్నారు. అన్నయ్య అన్న మాటలతో చెంపమీద కొట్టినట్టయింది. అన్నయ్య పడిన కష్టం సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసొచ్చింది. ఖుషీ సినిమా రేపు రిలీజ్ అనగా రాబోయే కొన్ని సంవత్సరాలు కష్టాలు ఉంటాయని నాకు మనసులో అనిపించింది. అది తర్వాత నిజమైంది. దేవుణ్ని ఎప్పుడు ఏమీ కోరలేదు. జీవితంలో మొదటిసారి అభిమానుల కోసం ఒక కోరిక కోరాను.

ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా.. బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నామన్నా అంటూ ఒక అభిమాని నాతో అన్నాడు. అప్పుడు ఒక్క హిట్ ఇమ్మని దేవుణ్ని కోరుకున్నా. మొట్టమొదటిసారి విజయం కోసం ప్రార్థించా. నా మొర ఆలకించి భగవంతుడు హిట్ ఇచ్చాడు. అన్నివదిలేసి వెళ్లిదామనుకున్న సమయంలో నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చాడు. మీ అందరి ముందు ఇలా నిలిపాడు. చాలా భయంతో ఈ సినిమాలో భగవంతుడి కేరెక్టర్ చేశాను. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

హీరోయిన్ హాన్సికాకు తల్లిగా శ్రీదేవి....

పులి సినిమా షూటింగ్ ని మంచి ఎంజాయి చేస్తున్నానని ప్రముఖ నటి శ్రీదేవి తెలిపారు. చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక బృందంతో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీదేవి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ హాన్సికాకు తల్లిగా శ్రీదేవి నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ శ్రీదేవి తమిళ చిత్ర సీమలో అడుగుపెట్టారు.  ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు.
అలాగే శృతీ హాసన్, సుదీప్ కూడా నటిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల వయస్సులో బాలనటిగా చిత్రసీమలోకి అడుగు పెట్టిన శ్రీదేవి... తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఇంగ్లీషు వింగ్లీషు చిత్రం ద్వారా శ్రీదేవి బాలీవుడ్ లో  సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అల్లు అర్జున్...?

శేఖర్ కమ్ముల ఇప్పటివరకు పెద్ద హీరోలతో సినిమా చేయలేదు. తాజాగా ఆయన అల్లు అర్జున్‌తో సినిమాకు సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, సరికొత్త పాయింట్‌తో శేఖర్‌కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో అల్లు అర్జున్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి సల్మాన్‌ఖాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

త్రిష త్వరలో పెళ్లిపీటలెక్కనుంది

అందాల భామ త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గత కొంతకాలంగా మీడియాలో త్రిష పెళ్లి ఫై చాల రూమర్స్ వస్తున్నాయి. అయితే వాటి అన్నిటికి త్వరలోనే పుల్ స్టాప్ పెట్టనున్నారు. కొంతకాలంగా బిజినెస్‌మేన్ – ప్రొడ్యూసర్ అయిన వరుణ్‌ మణియన్‌ ప్రేమలో త్రిష మునిగితేలుతున్న సంగతి తెలిసిందే.. కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు హీరోయిన్ త్రిష రెడీ అయ్యింది. మార్చిలో వరుణ్‌తో త్రిష వివాహం చేయాలని ఇరుకుటుంబాల పెద్దలు కూడా నిర్ణయించినట్లు కోలీవుడ్ సమాచారం.కొద్దిరోజుల కిందట వీళ్లిద్దరి నిశ్చితార్థంపై రకరకాలుగా వార్తలొచ్చాయి. ప్రస్తుతం త్రిష వయస్సు 31 ఏళ్ళు. తెలుగు లో తాజాగా బాలకృష్ణతో ‘లయన్’ చిత్రం, తమిళంలో మరో చిత్రం చేస్తోంది. ఈ రెండూ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

‘పందెం కోళ్ళు’ గా ధనుష్ నేషనల్ అవార్డు ఆడుకలం’ సినిమా

‘వేలఇల్లా పట్టదారి’ సినిమాకి డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన ధనుష్ ‘రఘువరన్ బిటెక్’ సినిమా జనవరి 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో తెలుగులో ధనుష్ కి వచ్చిన ఈ కొత్త క్రేజ్ ని వాడుకుంటూ ధనుష్ మరో హిట్ సినిమాని తెలుగులోకి అనువదించే పనిలో ఉన్నాడు నిర్మాత కిషోర్ కుమార్ రెడ్డి.
2011లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘ఆడుకలం’ సినిమాని తెలుగులో ‘పందెం కోళ్ళు’ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పందెం కోళ్ళు సినిమా కోళ్ళ పందెంల నేపధ్యంలో ఒక రూరల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ మరియు స్పెషల్ జ్యూరీ నేషనల్ అవార్డులు లభించాయి. ఈ సినిమాతో తమిళంలో తాప్సీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. జనవరి చివర్లోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

కలల రాకుమారుడు ఇంకా తారసపడలేదట.....

అందాల భామ కాజల్ అగర్వాల్ తన కలల రాకుమారుడిని ఇంకా కలవలేదని, తన ట్రావెల్ లో అలాంటి వారు ఇంకా తారసపడలేదని అంటోంది. చాలా రోజులుగా కాజల్ అగర్వాల్ తన లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పిన మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ నిజం కాదని తన కలల రాకుమారుడు ఇంకా తారసపడలేదని అంటోంది. ‘నేను ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోనున్నానని వార్తలు వస్తున్నాయి. కానీ అందులో అస్సలు నిజం లేదు. నేను హీరోయిన్ గా బిజీగా ఉన్నాను. ఈ సంవత్సరం కూడా బిజీ బిజీగా ఉండనున్నాను. ఇలాంటి టైంలో నేను లవ్ అండ్ పెళ్ళికి ఎలా సమయం కేటాయించగలను.? లైఫ్ లాంగ్ ఇలా ఒంటరిగానే ఉండలేం.. కావున ఒకరోజు పెళ్లి చేసుకుంటాం.. కానీ ఇప్పుడు కాదు అలాగే నాకు నచ్చిన వ్యక్తి ఇంకా దొరకలేదని’ కాజల్ అంటోంది.
కాజల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.