Friday 9 January 2015

సమీక్ష : గోపాల గోపాల


 తెలుగుపోస్టర్. కామ్ రేటింగ్ : 3.5/5

ఏడాదిగా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ను తెర ఫై చూస్తామా  అనుకున్న ఫాన్స్ కు ఈరోజు ప్రీమియర్ షో తో ఆ కోరిక తీరిపోయింది. అర్ధరాత్రి నుండే థియేటర్స్ దగ్గర అబిమానుల సంబరాలు మొదలయ్యాయి. హైదరాబాద్ , విశాఖ వంటి జంట నగరాల్లో పవన్ , విక్టరీ అబిమానులు థియేటర్స్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ప్రీమియర్ షో కి అద్బుత మైన స్పందన వచ్చింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మల్టీ స్టారర్ మూవీ అభిమానులనే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది

ఇక సినిమా విషయనికి వస్తే అభిమానులు దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్ గోపాలుడిగా, నిజజీవితంలో భక్తుడైన వెంకటేష్ నాస్తికుడైన గోపాల రావు పాత్రలో నటించిన క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు మూడు రోజుల ముందే బోగి, సంక్రాంతి పండుగలు ఈ సినిమా రిలీజ్ తో మొదలైంది. భారీ అంచనాల నడువ ఈ రోజు విడుదలైన ఈ సినిమా షూటింగ్  మొదలైన నాటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులు, అభిమానుల అంచనాలను ‘గోపాల గోపాల’ ఎంతవరకూ అందుకుంది......

కథ :
ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి గోపాల్ రావు(వెంకటేష్). స్వతహాగా గోపాల్ రావు నాస్థికుడు. కానీ తను చేసేది మాత్రం దేవుడి బొమ్మలను, విగ్రహాలను అమ్మడం. ఆ విగ్రహాలను అమ్మడంలో మాత్రం దేవుళ్ళ పేర్లను, ప్రజల మూడ నమ్మకాలను బాగా వాడుకుంటూ ఉంటాడు. అప్పుడే గోపాల్ రావు ఉండే ఏరియాలో సంభవించిన భూకంపం వల్ల గోపాల్ రావు షాప్ మొత్తం కూలిపోతుంది. దాంతో తన షాప్ పేరు మీద చేసిన ఇన్స్యూరెన్స్ ని ఇమ్మని గోపాల్ రావు కోరతాడు. కానీ ఆ నష్టం గాడ్ అఫ్ యాక్ట్ అనే దాని వల్ల జరిగిందని, అలా జరిగితే ఇన్సూరెన్స్ ఇవ్వరని చెప్పడంతో గోపాల్ రావు తనకు నష్టం చేసిన దేవుడిపై కేసు వేస్తాడు.
ఆ కేసులోకి మేము దైవాంస సంభూతులం అని చెప్పుకుంటూ స్వామీజీలుగా పేరు తెచ్చుకున్న లీలాధర (మిథున్ చక్రవర్తి), గోపిక మాత(దీక్ష పంత్), సిద్దేశ్వర మహారాజ్(పోసాని కృష్ణ మురళి)లను ఇన్వాల్వ్ చేస్తాడు. గోపాల్ రావు చేసిన పనికి అతన్ని చంపడానికి ఈ స్వామీజీలు ట్రై చేస్తున్న టైంలో గోవింద గోపాల హరి అలియాస్ శ్రీ కృష్ణుడు(పవన్ కళ్యాణ్) ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన గోపాల గోపాల్ రావుకి ఎలా సాయం చేసాడు.? అసలు నాస్తికుడైన గోపాల్ రావు దగ్గరకి కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు.? దేవుని మీద వేసిన కేసులో గోపాల్ రావు గెలిచాడా.? లేదా.? గోపాల్ రావుని అడ్డుకోవడం కోసం లీలాధర, గోపిక మాత, సిద్దేశ్వర మహారాజ్ లు ఏమేమి చేసారు.? ఈ గోపాల్ రావు – గోపాలుడి కాంబినేషన్ ఎలా ఉందనేది.? మీరు వెండితెరపైనే చూడాలి..


ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది, సినిమాకి ప్రాణం పోసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాకి హైలైట్ గా నిలిచేది పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ అక్కడ వారిమధ్య వచ్చే సీన్స్, ఆ తరువాత సెకండాఫ్ లో వారిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ నవ్విస్తూనే, వాళ్ళని ఎంతో ఆలోచించేలా చేస్తాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులకు, ముఖ్యంగా అభిమానులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. మోడ్రన్ శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం, డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, ఆ పాత్రకి రాసిన డైలాగ్స్ అన్నీ హైలైట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ లుక్ అండ్ పెర్ఫార్మన్స్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒక దేవుడి పాత్రలో పవన్ వేసే కొన్ని పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఇక నాస్తికుడిగా వెంకటేష్ నటన బాగుంది. ఆయన పాత్ర సినిమాలో ఎక్కువ సేపు ఉంటుంది. ముఖ్యంగా కోర్టు సీన్స్ లో వెంకటేష్ వేసిన సెటైర్స్, పవన్ కళ్యాణ్ తో వెంకీ వేసే పంచ్ లు చూసే ఆడియన్స్ లో ఒక కొత్త ఫీలింగ్ ని కలిగిస్తాయి. ముఖ్యంగా వెంకటేష్ పవన్ ని తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ వచ్చే సీన్స్ బాగున్నాయి.

ఇక చెప్పుకోవాల్సింది బాబాజీగా చేసిన పోసాని కృష్ణ మురళి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసాడు. వెంకటేష్ – పోసాని కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా నవ్వు తెప్పిస్తాయి. బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి లీలాధర స్వామీజీ పాత్రలో జీవించాడు. ఆయనకి డైలాగ్స్ తక్కువ ఉన్నా అతని పాత్ర మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. కృష్ణుడు, దీక్ష పంత్, రంగనాథ్, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, మధు శాలిని వీళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక ఈ సినిమా టాప్ హైలైట్స్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్, పవన్ – వెంకీ కాంబినేషన్ లో వచ్చే ఘటోత్కచుని సీన్, కోర్ట్ సీన్, క్లైమాక్స్ ఎపిసోడ్. ఇక వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చే ‘భజే భాజే’ సాంగ్ చూసే ప్రేక్షకులకి కన్నుల పండుగగా ఉంటుంది.

తెలుగుపోస్టర్. కామ్ రేటింగ్ : 3.5/5

0 comments:

Post a Comment