Saturday 3 January 2015

’బాబాయ్-అబ్బాయ్’ల డైలాగ్స్


నందమూరి హీరోలంటేనే నటనకు ప్రతిరూపం.ఆనాటి అన్న ఎన్టీఆర్ నుంచి.. నేటి వారసులు బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ లు ఆ ఘనతను నిలుపుకుంటూనే వున్నారు. తాజాగా, బాబాయ్-అబ్బాయ్ లు ఒకేసారి టీజర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి దుమ్మదులిపారు.
ఈ ఇద్దరి కొత్త సినిమాల విషయానికి వస్తే జూ. ఎన్టీఆర్ ’టెంపర్’, బాలయ్య ’లయన్’ సినిమాల టీజర్లు గురువారం విడుదలయ్యాయి. టీజర్లల్లో ఇద్దరూ డైలాగ్స్ తో ఇరగదీశారు. ”ఇద్దరు కొట్టుకుంటే అది యుద్ధం.. ఒక్కడు మీద పడితే అది దండయాత్ర… ఇది దయాగాడి దండయాత్ర..” అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ’టెంపర్’ ఏ రేంజిలో ఉంటుందో ప్రేక్షకులకు ఓ శాంపిల్ చూపించాడు. యూట్యూబ్ లో ఇది సంచలనం సృష్టించడం మొదలుపెట్టేసింది.
”కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్‌లో కనపడుతుంది, నేను కొడితే.. హిస్టరీలో వినబడుతుంది”… ఇదీ లయన్ సినిమా టీజర్ లో నందమూరి బాలకృష్ణ డైలాగ్. బాలయ్య టీజర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. టీజర్ లో బాలయ్య మార్కు పంచ్ డైలాగులు కనిపించాయని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇలా.. బాబాయ్-అబ్బాయ్ లు యూట్యూబ్ లో యుద్దం చేశారు. టీజర్ పెట్టి ఇంకా ఒక్క రోజు కూడా కాకముందే లక్ష మందికి పైగా అభిమానులు బాబాయ్-అబ్బాయ్ ల టీజర్స్ ను వీక్షించారు. మరీ.

0 comments:

Post a Comment