చిరంజీవి నటించిన
చిత్రాల్లోని పాటలను తన సినిమాల్లో రీమిక్స్ చేస్తున్న రామ్‌చరణ్ ఈసారి
చిరు చిత్రంలోని ఓ పాటను తన సినిమాకు టైటిల్‌గా పెట్టాలనే ఆలోచనలో
వున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెళితే... శ్రీనువైట్ల-రామ్‌చరణ్ కలయికలో
త్వరలో ఓ చిత్రం రూపొందబోతుంది. ఇటీవలే కథ విని ఈ చిత్రానికి చరణ్
గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. కాగా ఈ చిత్రానికి చిరంజీవి నటించిన జగదేక
వీరుడు-అతిలోకసుందరి చిత్రంలో చిరంజీవి పరిచయగీతంగా తెరకెక్కించిన పాట
పల్లవిలోని ప్రారంభ పదమైన మై నేమ్‌ఈజ్ రాజును టైటిల్‌గా అనుకుంటున్నారట.
చిరంజీవితో పాటు చరణ్‌కు కూడా ఈ టైటిల్ నచ్చడంతో ఈ టైటిల్‌నే
నిర్ణయించినట్లుగా సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ
చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. ప్రధాన
నాయికగా ప్రణీతను ఎంపిక చేశారని, రెండో నాయికగా రెజీనా లేదా పూజా హెగ్డే
నటించే అవకాశం వుందని చిత్ర వర్గాల సమాచారం.
0 comments:
Post a Comment