Monday, 1 December 2014

గోపాలా.. గోపాలా డైలాగ్స్.. వెంకీ వర్సెస్ పవన్ వార్

తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న మూవీ గోపాలా.. గోపాలా ఈ సినిమాలో వెంకీ-పవన్ మధ్య వచ్చే ఎక్స్‌క్లూజివ్ డైలాగ్స్‌ను  వీరిద్దరి మధ్య ఓ సన్నివేశంలో వచ్చే సీన్స్ ఇలా ఉంటాయని సమాచారం.
కానీ ఫైనల్ మాత్రం కాదు ఇవి పవన్ వెంకటేష్ అభిమానుల కోసం
పవన్ ను దేవుడి రూపంలో చూస్తే అభిమానులు పండగ చేసుకోవడం ఖయంలా కనిపిస్తున్నది .                     వెంకీ: దైవం అంటే నమ్మకం మాత్రమే
పవన్: నమ్మకం అంటేనే నిజం. నిజాన్ని నమ్మితే నమ్మకం ఏర్పడుతుంది. దైవం అంటే నమ్మకం. అంటే దైవం ఉన్నది నిజం.
వెంకీ: ఉంటే దైవం కనపడదే..
పవన్: గాలి యెక్క రంగు కనిపెట్టు దైవం కనపడుతుంది. నీటి యెక్క రూపం చూపెట్టు దైవం కనపడుతుంది.
వెంకీ: అదెలా సాధ్యం సృష్టిలో లేనివి ఎలా కనిపెట్టి చూపించాలి.
పవన్: ఆ .. సృష్టిలో అన్నీ ఉండవు. వాటినే సృష్టి ధర్మాలంటారు.
వెంకీ: అయితే సృష్టిలో లేనివాటిని మేము ఎందుకు నమ్ముతున్నాం..
పవన్: మీరు వీటిని నమ్మట్లేదు.. విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని పాటిస్తున్నారు. (ఇలా మాట్లాడుతూ ఫైనల్‌గా పవన్ ఫైనల్ పంచ్ ఇస్తాడు) సృష్టి థర్మాలను పాటించాలే తప్ప.. ప్రశ్నించకూడదు.

0 comments:

Post a Comment