ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ మొత్తం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ సినీజనం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ సంవత్సరమే ప్రారంభమవుతుందని చిరు తనయుడు ఛెర్రీ కూడా ప్రకటించారు. ఈ సినిమాను చిరు సతీమణి సురేఖ సమర్పణలో తానే స్వయంగా నిర్మిస్తానని కూడా ఛెర్రీ ప్రకటించారు. ఇందుకోసం కథలు వింటున్నామని కథ నచ్చితే రూ.కోటి పారితోషకం ఇవ్వడానికి సిద్ధమని కూడా ప్రకటించాడు. అలాగే ఈ సినిమాకు వివి.వినాయక్, కృష్ణవంశీ,బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని పేర్లు వినిపించినా అవి ఫైనలైజ్ కాలేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం తెలుగు చిత్రసీమలో ఉన్న అగ్ర కథారచయితలు రెండు కథలు చిరుకు వినిపించినా ఆ లైన్‌కు ఓకే చేసిన చిరు పూర్తి స్క్రిఫ్ట్ సిద్ధం చేయమని వారికి సూచించినట్టు సమాచారం. అయితే కథ పూర్తిగా నచ్చే వరకు సినిమా స్టార్ట్ చేయకూడదని.. ఇతర వివరాలు ప్రకటించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఏదేమైనా చిరు 150వ సినిమా ఈ సంవత్సరంతో పాటు వచ్చే సంక్రాంతి దాటిన తర్వాత కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమా ప్రారంభోత్సవం మరికాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment