Wednesday, 10 December 2014

అత్యంత శృంగారభరితమైన చిత్రం ఎలోన్?

కెరీర్‌లో నేను చేస్తున్న అత్యంత శృంగారభరితమైన చిత్రం ఎలోన్ అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ బిపాసబసు. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ సుందరి నటిస్తున్న తాజా చిత్రమిది. ఈ సినిమా కోసం బుల్లితెర నటుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌తో రొమాన్స్ చేస్తోంది బిపాసబసు. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భూషణ్ పటేల్ దర్శకుడు. ఈ సినిమా కోసం ఇటీవలే చిత్ర నాయకానాయికలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్ని తెరకెక్కించారట.

వీటిలో బిపాసబసు మోతాదుకు మించి శృంగారాన్ని ఒలికించినట్లు తెలిసింది. దీనిని గురించి బిపాసబసు మాట్లాడుతూ ఇన్నేళ్ల నా సినీజీవితంలో ఎప్పడూ ఇంతటి శృంగారాన్ని వెండితెరపై పండించలేదు. కథానుగుణంగా చాలా సన్నివేశాల్లో బోల్డ్‌గా నటించాల్సివచ్చింది. అయితే ఇవన్నీ కథలో అంతర్భాగంగానే ఉంటాయి. ప్రేమకథానేపథ్యంలో సాగే హారర్ చిత్రమిది. ఓ అమ్మాయి, అబ్బాయి, దెయ్యం నడుమ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తప్పకుండా నా కెరీర్‌లో వైవిధ్యంగా నిలిచిపోతుందనే నమ్మకముందిఅని తెలిపింది. బిపాసబసు ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రం జనవరి16న ప్రేక్షకుల ముందుకురానుంది.

0 comments:

Post a Comment