Wednesday, 10 December 2014

1940 నాటి కథ





రజనీకాంత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం లింగా. సోనాక్షిసిన్హా , అనుష్క కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకుడు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. ఈ నెల 12న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ బ్రిటీష్ పాలన కాలానికి సంబంధించిన కథ ఇది. 1938-40 సంవత్సరాల నడుమ కథ నడుస్తుంది. ఓ ఆనకట్ట నిర్మాణం వెనుక దాగివున్న ఆసక్త్తికరమైన సంఘటలేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

టీమ్‌అంతా ఓ ఛాలెంజ్‌లా భావించి కేవలం ఆరు నెలల వ్యవధిలోనే చిత్రాన్ని పూర్తిచేశాం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమించారు. వారి పట్టుదల కారణంగానే తక్కువ వ్యవధిలో చిత్రీకరణ పూర్తయింది. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ రజనీకాంత్ నటన, పాత్ర చిత్రణ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అందాల కథానాయికలతో ఆయన చేసే హంగామా ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

రజనీకాంత్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. కథ, కథనాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. ఇటీవలే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది అని తెలిపారు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందించారు అని నిర్మాత పేర్కొన్నారు. జగపతిబాబు, సంతానం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రత్నవేలు, సంగీతం: ఎ.ఆర్.రహమాన్, కథ: పొన్ కుమారన్.

0 comments:

Post a Comment