Monday, 8 December 2014

మలయాళ భామ భావన పెళ్లికోసం తొందర

ఒంటరి మహాత్మ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది మలయాళ భామ భావన. ఆ సినిమాల్లో చక్కటి రూపలావణ్యం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒకటి అరా తెలుగు సినిమాల్లో నటించినా ఆమె మాతృభాషలో అవకాశాలు రావడంతో మళ్లీ ఇటువైపు దృష్టిసారించలేదు. కొంతకాలంగా మలయాళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ సుందరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి సినీ వర్గాల్ని విస్మయపరిచింది. గత రెండేళ్లుగా ఓ నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె ఈ బంధాన్ని సాధ్యమైనంత తొందరలో పెళ్లిపీటల పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటున్న తరుణంలోనే కెరీర్‌కు ముగింపు పలకడం మంచిదనే ఆలోచనతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకు ఇటీవలే అగ్ర తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఓ కథానాయిక సలహా కూడా కారణమని తెలిసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఈ సుందరి ఆలోచనను చూసి ఆశ్చర్యపోతున్నాయి మలయాళ సినీ వర్గాలు.

0 comments:

Post a Comment