Friday, 24 October 2014

నితిన్‌కు హ్యాట్రిక్ హిట్ లభించడం ఖాయం?

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం చిన్నదాన నీకోసం. కరుణాకరన్ దర్శకుడు. విక్రమ్ గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మిస్తీ చక్రవర్తి తెలుగు తెరకు కథానాయికగా పరిచయమౌతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 
నితిన్ ఈ సంస్థలో  ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి హిట్‌ల తరువాత చేస్తున్న మూడో సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి అలాగే హీరో నితిన్ కూడా హ్యాట్రిక్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు ఈ సినిమా ట్రైలర్ చూస్తే నితిన్ కు హ్యాట్రిక్ హిట్ లభించడం ఖాయం ల అనిపిస్తున్నది.


0 comments:

Post a Comment