Friday, 24 October 2014

తెలుగులో కొత్త సినిమాలు తిరస్కరిస్తున్న అనుష్క?

అనుష్క. ప్రస్తుతం ఈ సుందరి నటిస్తున్న రుద్రమదేవి బాహుబలి చిత్రాలు సెట్స్‌పై వున్నాయి. ఈ సినిమాల కోసం తెలుగులో ఇతర చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరిస్తోందని చెబుతున్నారు. చాలామంది దర్శకనిర్మాతలు ఆమెకు కథలను వినిపించేందుకు సిద్ధమైనా ఈ అమ్మడు మాత్రం వాటిపట్ల ఆసక్తి చూపడం లేదని సమాచారం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాతనే తెలుగులో కొత్త చిత్రాన్ని అంగీకరించేందుకు తాను సిద్ధమని, అప్పటి వరకూ తెలుగులో మరో సినిమా చేసేది లేదని వారికి కరాఖండిగా చెబుతున్న అనుష్క తమిళంలో మాత్రం వరుసగా సినిమాల్ని అంగీకరిస్తూ తెలుగు దర్శక నిర్మాతల్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం తమిళంలో లింగాతో పాటు అజిత్ సరసన ఓ సినిమాలో కథానాయికగా నటిస్తుంది అనుష్క.

0 comments:

Post a Comment