Thursday, 23 October 2014

ఎట్టకేలకు సమంతకు మాతృభాష తమిళంలో ‘కత్తి’ హిట్


ప్రస్తుతం ఉన్న సౌత్ టాప్ హీరోయిన్స్ లో బ్యూటిఫుల్ సమంత కూడా ఒకరు. తక్కువ సినిమాలతోనే తెలుగులో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది స్వతహాగా సమంత తమిళమ్మాయి. అలాగే తను హీరోయిన్ గా తొలి పరిచయం అయ్యింది కూడా తమిళ సినిమాతోనే. కానీ తనకి స్టార్డం వచ్చింది మాత్రం తెలుగులోనే ఎందుకంటే ఎక్కువ హిట్స్ ఇచ్చింది ఇక్కడే . సమంత చేసిన తెలుగులో చేసిన మొదటి సినిమా ‘ఏం మాయ చేసావే’తో ఎంతో మంది యువత డ్రీం గర్ల్ గా మారిపోయింది. సమంతకి తెలుగులో తను చేసిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ అయ్యాయి. కానీ తన మాతృభాష అయిన తమిళంలో మాత్రం ఒక్క డైరెక్ట్ హిట్ కూడా లేదు. ఒకే ఒక్క హిట్ ఉన్నప్పటికీ అది ‘ఈగ’ సినిమాకి డబ్బింగ్ కావడం వలన డైరెక్ట్ ఫిల్మ్ అని చెప్పుకునే అవకాశం లేదు. చాలా కాలంగా తమిళంలో డైరెక్ట్ హిట్ అందుకోవాలని ఎదురు చూస్తున్న సమంత సూర్యతో చేసిన ‘అంజాన్’ సినిమా తన కోరికని తీరుస్తుందని ఆశ పడింది. కానీ అది ఫ్లాప్ అవ్వడంతో కాస్త నిరాశ పడింది. కానీ నిన్న విడుదలైన ‘కత్తి’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సమంత కోరిక నెరవేరింది. దాంతో సమంత ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది.

0 comments:

Post a Comment