Sunday, 12 October 2014

పెళ్లయిన మగవాళ్లతో చనువుగా ఉండను

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ  -‘‘నేనుండే ప్లేస్ అయినా, నేను చేసే ఫ్రెండ్‌షిప్ అయినా నాకు సౌకర్యవంతంగా ఉండాలి. నాకు అనువుగా లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండను.

 అలాగే, నాకు సరిపడని వ్యక్తులతో స్నేహం చేయలేను. ముఖ్యంగా పెళ్లయిన మగవాళ్లతో చనువుగా ఉండను. వాళ్ల భార్యలను అభద్రతాభావానికి గురి చేయడానికి ఇష్టపడను. అలాగే, ఎవరికైనా గాళ్‌ఫ్రెండ్ ఉంటే.. ఆ అబ్బాయితో అస్సలు క్లోజ్‌గా ఉండను. ఎందుకంటే, పరాయి సొత్తుకి ఆశపడే అమ్మాయిని కాదు నేను. నా విషయంలో కూడా ఇతరులు అలానే ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ నా బాయ్‌ఫ్రెండ్‌పై ఎవరైనా అమ్మాయి కన్నేస్తే... నేను చూస్తూ ఊరుకోను’’ అన్నారు. ‘‘ఇంతకీ మీ బాయ్‌ఫ్రెండ్ ఎవరు?’’ అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే... ‘ఏదో మాట వరసకు అన్నాను కానీ, అలాంటి ఫ్రెండ్స్ ఎవరూ నాకు లేరు’’ అని ముక్తాయింపు ఇచ్చారామె.
 

0 comments:

Post a Comment