Thursday, 23 October 2014

ఆర్నాల్డ్ నుంచి విక్రమ్ కు ఆహ్వానం..

హాలీ వుడ్ యాక్షన్ హీరో, కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ శ్వార్జ్ నెగర్ విక్రమ్ ని అమెరికా ఆహ్వానించడమే ఇందుకు కారణమట. దీంతో విక్రమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే జరిగిన శంకర్ ’ఐ’ ఆడియో వేడుకకి ఆర్నాల్డ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. బిజీ షెడ్యూల్ కారణంగా అన్నాల్డ్ కార్యక్రమంలో మధ్యలోనే వెళ్లిపోయాడు. దీంతో.. ’ఐ’ హీరో విక్రమ్ తో ముచ్చటించేందుకు వీలుకాలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ.. తాజాగా, విక్రమ్ ను అమెరికాకు ప్రత్యేకంగా ఆహ్వానించారు ఆర్నాల్డ్. ఆర్నాల్డ్ ఆహ్వానంతో కుషి  అయిపోతున్నాడు విక్రమ్. త్వరలోనే అమెరికా వెళ్లి హాలీవుడ్ యాక్షన్ హీరోని కలసి ముచ్చటించడానికి రెడీ అయిపోయాడు.

0 comments:

Post a Comment