Friday, 24 October 2014

సమీక్ష : కార్తికేయ


తెలుగు పోస్టర్ రేటింగ్ : 3.5/5 

హీరో నిఖిల్ హీరోగా నటించిన  థ్రిల్లర్ ‘కార్తికేయ’. ఈ మూవీ ట్రైలర్స్ రిలీజ్ అయిన టైం నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతే కాకుండా టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ట్రైలర్ చలబగుందని చెప్పి సినిమాపై అంచనాలు పెంచాడు. ‘స్వామి రారా’ లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ నిఖిల్ – స్వాతి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందు మొండేటి దర్శకుడిగా తొలి పరిచయం అవుతున్న ఈ సినిమా తన కెరీర్లో పెద్ద హిట్ గా నిలుస్తుందని నిఖిల్ ఆశిస్తున్నాడు. మరి నిఖిల్ కోరికను నెరవెరిందా లేదా తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే....

కథ:
సుబ్రహ్మణ్య పురం అనే ఊల్లొ ఒక గుడి ఉంటుంది కొన్ని అనుకోని కారణాల వల్ల అ గుడిని మూసేస్తారు. అయితే అ గుడిని తెరవడానికి ప్రయత్నించిన వాళ్ళంతా పాముకాటుతో మరణిస్తుంటారుఅదే సమయంలో కార్తీక్(నిఖిల్) మెడిసిన్ ఫైనలియర్ చదివే కుర్రాడు. కార్తీక్ చాలా ప్రాక్టికల్ ఎక్కడైనా ఓ సమస్య లేదా ఓ ప్రశ్న ఉంది అని తెలిస్తే దాని చేధించడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు. ఎలా అంటే ప్రశ్నని ప్రశ్నాలా వదిలేయడం కంటే చావడం బెటర్ అనేంతల ఇలాంటి కార్తీక్ అదే కాలేజీలో చదువుతూన్న వల్లి (స్వాతి రెడ్డి)ని చూసి ప్రేమలో పడతాడు.  మెడిసిన్ పూర్తి చేసుకున్న కార్తీక్ మెడికల్ క్యాంపు కోసం సుబ్రహ్మణ్య పురంకి వెళతాడు. అక్కడ అనుకోని సంఘటనలు మరియు గుడి గురించి తెలుసుకున్న జర్నలిస్ట్ చనిపోతాడు అతడి డైరీ కార్తీక్ కి దొరుకుతుంది అ డైరీ లో గుడి గురించి మరియు గుడి తెరవలనుకునే వాళ్ళు పాముకాటుతో ఎలా మరణించారో ఉంటుంది కానీ కారణం ఉండదు ఆ చావుల వెనుక ఉన్న కారణాన్ని తెలుసు కోవడానికి కార్తీక్ ఏం చేసాడు.? ఈ జర్నీలో కార్తీక్ ఏమేమి తెలుసుకున్నాడు.? అసలు ఆ గుడి మూత పడటానికి గల కారణం ఏమిటి.? ఆ గుడి గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు పాము కాటుకే ఎందుకు చనిపోతున్నారు.? కీర్తి వర్మ రాజు ఆ గుడిని కట్టించినప్పుడు ఆ గుడికి ఏదైనా విశిష్టతని కల్పించాడా.? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది.


నిఖిల్ పాత్ర చాలా బాగుంది. స్వామి రారా తరువాత మరో మంచి పాత్రను ఎంచుకున్నాడు . కార్తీక్ పాత్రని డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు, దానికన్నా బాగా నిఖిల్ ఆ పాత్రని చేయడమే కాకుండా, ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిఖిల్ ఈ మూవీలో చూడటానికి చాలా అందంగా ఉన్నాడు,  ఒక నటుడిగా నిఖిల్ చాలా మెచ్యూరిటీ చూపించాడు. ఇక స్వాతి పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కథా పరంగా సస్పెన్స్ ఎలిమెంట్స్ కి స్వాతికి సంబంధం లేకపోయినప్పటికీ ఉన్న లవ్ ట్రాక్ లో మాత్రం చిన్ని చిన్ని క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. కొన్ని చోట్ల ముఖ్యంగా నిఖిల్ – స్వాతి మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ చాలా బాగుంది. వీరి మధ్య వచ్చే లవ్ ట్రాక్స్ ని చందు చాలా బాగా పిక్చరైజ్ చేసాడు.

ఇక సినిమాలో నిఖిల్ ప్రెండ్స్ గా చేసిన ప్రవీణ్, సత్య తమ కామెడీతో మిమ్మల్ని నవ్విస్తూ ఉంటారు. సినిమాలో కీలకమైన పాత్రలు చేసిన వారిలో ముందుగా రావు రమేష్ గురించి చెప్పాలి. రావు రమేష్ పాత్ర సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అలాగే ఆయన నటన చాలా బాగుంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా కిషోర్, పూజారిగా తనికెళ్ళ భరణిల పెర్ఫార్మన్స్ చాలా బాగుంది.ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని తను చెప్పిన విధానం, చూడగానే అందరికీ కథ బాగా అర్థమవ్వడమే కాకుండా కథకి బాగా కనెక్ట్ అయిపోతారు.


ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సింపుల్ గా సాగుతుంది. కానీ సెకండాఫ్ విషయానికి వస్తే అక్కడక్కడా కాస్తా తగ్గుతుంది. కథా పరంగా వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ సినిమాకి పెద్దగా హెల్ప్ కాలేదని చెప్పాలి . దానివల్ల సెకండాఫ్ లో కథ  లోకి కాస్త ఆలస్యంగా వెళ్ళారు అనిపిస్తుంది. ఈ సినిమాకి క్లైమాక్స్ లాజికల్ పరంగా చాలా బాగుంది. కానీ మొదటి నుంచి చూస్తున్న ఆడియన్స్  క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుంది అనే ఫీల్ అవుతాడు కానీ డైరెక్టర్ చందు ఆ రేంజ్ కి రీచ్ అవ్వకుండా చాలా సింపుల్ గా క్లైమాక్స్ ముగించేసాడు అనిపిస్తుంది.దాని వాళ్ళ ఆడియన్స్ కొద్దిగా
అసంతృప్తిగా ఫీల్ అవుతారు.

ముందు నుంచి ఉన్న అంచనాలను కార్తికేయ సినిమా అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. డైరెక్టర్ చందు మొండేటి కొత్తవాడైనా ఎక్కడా తడబడకుండా అనుభవం ఉన్నవాడిలా తాను అనుకున్నది అనుకున్నట్టుగా, సామాన్య ప్రజలకి సైతం అర్థమయ్యేలా తీయడం  ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నిఖిల్ పెర్ఫార్మన్స్, కథ, సస్పెన్స్ ఎలిమెంట్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త స్లో అనిపించడం, కొన్ని లాజికల్ పాయింట్స్ మిస్ అవ్వడం లాంటివి చెప్పదగిన మైనస్ పాయింట్స్. మొత్తంగా ‘కార్తికేయ’ సినిమా మిమ్మల్ని సస్పెన్స్ తో థ్రిల్ చేసి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ఎందుకంటే ఈ మధ్యలో తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు కాబట్టి ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదించవచ్చు.

ఈ సినిమాను థియేటర్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి

0 comments:

Post a Comment