Sunday 12 October 2014

రవితేజ డబుల్ కిక్ !

రవితేజ హీరోగా రూపొందిన కిక్ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కిక్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిసింది. చిత్ర కథలో భాగంగా రవితేజ యాభై ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నాడని చిత్ర వర్గాల సమాచారం. ఇటీవలే ఈ పాత్ర కోసం రవితేజకు దర్శకుడు సురేందర్‌రెడ్డి మేకప్ టెస్ట్ చేయించినట్లు చిత్ర వర్గాల సమాచారం.


0 comments:

Post a Comment