Sunday 12 October 2014

సమంత టాక్‌షో

అందాల సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత తెలుసు? అస్సలు ఈ అమ్మడి కెరీర్‌ సంగతులేమిటి? వ్యక్తిగత విశేషాలేమిటి? గాసిప్‌‌సలో అసలు నిజాలేవి? అసలు సమంత అంటే ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? కోలీవుడ్‌లో ఎందుకు ఫ్లాపైంది? ప్రస్తుతం నటిస్తున్న సినిమాలేవి? ఇలా పదుల సంఖ్యలో ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి బుల్లితెర ప్రేక్షకుల ముందుకొస్తోంది సమంత. బుల్లితెరపై ఓ టాక్‌షోలో ఈ అమ్మడు అన్ని రహస్యాల్ని చెప్పేస్తానని ఊరిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రచారం సాగుతోంది. టాలీవుడ్‌లో జెస్సీగా అడుగుపెట్టిన ఈ అమ్మడు అనతికాలంలోనే గోల్డెన్‌లెగ్‌ అన్న ట్యాగ్‌తో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోయింది. ఈ ప్రాసెస్‌ ఎలా జరిగిందన్నది ఆసక్తికరం. సమంత చాలా చిలిపి అమ్మాయి. ఆన్‌సెట్‌‌స ఎంతో జోవియల్‌గా ఉంటుంది. అంతేకాదు మాటల్లో ఎంతో నిజాయితీ ధ్వనిస్తుంది. దాపరికాలు అనేవే తెలియవు. ఇవన్నీ తనని దగ్గరగా పరిశీలించినవారికి అర్థమవుతాయి. మరి అలాంటి మరెన్నో సంగతులు ఇక సామాన్యులకు కూడా తెలిసిపోతాయన్నమాట! మరి ఇదే టాక్‌ షోలో ప్రేమ, పెళ్లి గురించి? బోయ్‌ఫ్రెండ్‌ సిద్ధార్‌‌థ గురించి ఏం చెబుతుందో వినాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

0 comments:

Post a Comment