Sunday 12 October 2014

పూజా హెగ్డే హవా!


టాలీవుడ్‌లో నాయిక అవ్వాలని ముంబై నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది పూజా హెగ్డే. అందుకు తగ్గట్టే చక్కని ప్రతిభావని అన్న పేరు తెచ్చేసుకుంది. తొలిసినిమా `ఒక లైలా కోసం' రిలీజ్‌ కాకముందే నాగార్జున అంతటివాడి మనసు దోచింది. పూజ గొప్ప ప్రతిభావని. బాగా నటిస్తోంది. డ్యాన్సుల్లోనూ ఇరగదీస్తోంది అని నాగ్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. అదొక్కటే కాదు వరుణ్‌తేజ్‌ డెబ్యూ సినిమా `ముకుంద' కథ కూడా తెలుసు. పూజ నటిస్తున్న ఈ రెండో సినిమా కూడా హిట్టే అని చెప్పాడు. చైతన్యతో తొలివిజయం అందుకుని వరుణ్‌తేజ్‌తో రెండో విజయం అందుకుంటుందని కితాబిచ్చాడు. అందుకు తగ్గట్టే అమ్మడు నటించిన తొలిచిత్రం `ఒక లైలా కోసం' ఈ శుక్రవారం రిలీజవుతోంది. ఆ వెంటనే వచ్చే మరో శుక్రవారం `ముకుంద' రిలీజ్‌కి రెడీ అవుతోందని సమాచారం. ఆ లెక్కన రెండు వరుస శుక్రవారాలు అమ్మడివే. ఈ రెండు విజయాలు అందుకున్న వెంటనే మరిన్ని తెలుగు సినిమాలకు కమిటవ్వడానికి రెడీ అవుతోంది. ఇంతలోనే హృతిక్‌రోషన్‌ సరసన `మొహంజోదారో' సినిమాలో నాయికగా బిజీ అయిపోతుంది. అక్కడా క్రేజీ ప్రాజెక్టులు అమ్మడిని వరించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఇలియానా 2లా కనిపించే ఈ అమ్మడికి మునుముందు చాలా పెద్ద రేంజు ఉందని దీన్ని బట్టి అర్థం కావడం లేదూ?

0 comments:

Post a Comment