Sunday 12 October 2014

నా విషయంలో నాన్నను మించిన ఉత్తమ విమర్శకుడు మరోకరు లేరు.

కెరీర్ ప్రారంభం నుంచి నా నటనలోని లోపాలను ఎత్తిచూపుతూ నాన్న నాకు దిశానిర్ధేశం చేశారు అంటోంది శృతిహాసన్. నా విషయంలో మా నాన్నను మించిన ఉత్తమ విమర్శకుడు మరోకరు లేరు. పాటలు పాడటం, మ్యూజిక్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో గాయనిగా...సంగీత దర్శకురాలిగా రాణించాలనుకున్న నేను అనుకోకుండానే నటినయ్యాను. ప్రస్తుతం కథానాయికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుందీ సుందరి.

ఈ ఎనిమిది చిత్రాల్లో మూడు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ తన తండ్రి కమల్‌హాసన్ గురించి, తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ నేనేంటీ హీరోయిన్‌గా నటించడమేంటీ? నన్ను ప్రేక్షకులు అంగీకరిస్తారా? అని కెరీర్ తొలినాళ్లలో భావించేదాన్ని. అయితే అలాంటి స్టేజ్ నుంచి కథానాయికగా ప్రస్తుతం మూడు భాషల్లో బిజీగా మారానంటే దానికి కారణం మా నాన్నే . ఆయనిచ్చిన సలహాలు, సూచనలు పాటించడం వల్లే హీరోయిన్‌గా ఈ స్థాయికి చేరుకోగలిగానుఅని తెలిపింది.

0 comments:

Post a Comment