Tuesday 7 October 2014

అన్యాయాల్ని, అవినితీని అంతమొందించే కత్తిలాంటి యువకుడి కథే కత్తి

వరుస విజయాలతో  దూసుకుపోతున్నాడు కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్ . ఆయన హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కత్తి. సమంతా కథానాయిక. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేయనుంది. దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మధు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. రెండేళ్లక్రితం విజయ్, మురుగదాస్ కలయికలో వచ్చిన తుపాకీ ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాంతో కత్తి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అన్యాయాల్ని, అవినితీని అంతమొందించే కత్తిలాంటి యువకుడి కథే చిత్ర ఇతివృత్తం. అంతర్లీనంగా చక్కటి సామాజిక సందేశం వుంటుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్నందించిన పాటల్ని ఈ నెల 12న విడుదల చేయబోతున్నాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్.సి.విల్లియమ్స్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్.

0 comments:

Post a Comment