తెలుగు పోస్టర్ రేటింగ్ 3/5
నటీనటులు: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, డాని డెన్ జోంగ్ పా
సినిమాటోగ్రఫి: వికాస్ శివరామన్, సునీల్ పటేల్
సంగీతం: విశాల్-శేఖర్
బ్యాగ్రౌండ్ స్కోర్: సలీం సులేమాన్
దర్శకుడు: సిద్ధార్థ్ ఆనంద్
బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా రూపొందిన 'బ్యాంగ్
బ్యాంగ్' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్స్ దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో
భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ
చిత్రం ప్రేక్షకుల అంచనాలకు చేరుకుందా అని తెలుసుకునే ముందు కథ ఎంటో
తెలుసుకుందాం!
కథ:
ఇది కేవలం సిద్ధార్థ్ ఆనంద్
ఆవిష్కరించిన రొటీన్ కథ కానీ ప్రేక్షకుడికి బోర్ అనే ఫీలింగ్ లేకుండా తీయడంలో విజయం సాదించాడు ఇక కథ విషయానికి వస్తే లండన్ లోని కోహినూర్ వజ్రాన్నిరాజ్ వీర్ (హృతిక్ రోషన్) దొంగిలిస్తాడు.
కోహినూర్ వజ్రాన్ని దక్కించుకునేందుకు రాజ్ వీర్ వెనుక అంతర్జాతీయ మాఫియా
డాన్ ఓమర్ జాఫర్ (డాని), హమీద్ గుల్ (జావెద్ జాఫ్రీ) ల గ్యాంగ్
వెంటాడుతుంది. అయితే మాఫియా గ్యాంగ్ కు చిక్కకుండా ఓమర్ జాఫర్ ను ఎలాగైనా
కలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఓమర్ జాఫర్ ను ఎందుకు
కలుసుకోవాలనుకుంటాడు? మాఫియా ఛేజింగ్ లో రాజ్ వీర్ తో హర్లీన్ (కత్రినా
కైఫ్) ఎందుకు కలిసింది? రాజ్ వీర్ కోహినూర్ ఎందుకు దొంగిలించాడు? చివరికి
కోహినూర్ వజ్రం కథ ఏంటి అనే ప్రశ్నలకు తెరమీద సిద్ధార్థ్ ఆనంద్
ఆవిష్కరించిన దృశ్య రూపమే 'బ్యాంగ్ బ్యాంగ్'.
కథపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం లోపంగా మారింది. కేవలం స్క్రీన్
ప్లే ఆధారంగా ఓ ఛేజింగ్ లా సాగిన ఈ చిత్రం తొలి భాగంలో ట్రెడిషినల్
ఆడియన్స్ రోటిన్ గా అనిపించడమే కాకుండా, ప్రేక్షకులకు కొంత విసుగును
తెప్పిస్తుంది. అయితే రెండవ భాగంలో ఓ ట్విస్ట్ తో బ్యాంగ్ బ్యాంగ్
అనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో కొంత
సెంటిమెంట్ బ్యాంగ్ బ్యాంగ్ జోడించి ప్రేక్షకులతో ఓకే అనిపించుకోవడంలో
సిద్దార్థ్ ఆనంద్ సఫలమయ్యారు. కేవలం యూత్ ను టార్గెట్ గా చేసుకుని
నిర్మించిన ఈ చిత్ర విజయం కేవలం యాక్షన్, హృతిక్-కత్రినాల కెమిస్ట్రిపైనే
ఆధారపడి ఉంటుంది.
రాజ్ వీర్ గా హృతిక్ జేమ్స్ బాండ్ గా కనిపించాడు. 'సిక్స్ ప్యాక్'
హృతిక్ యాక్షన్ సీన్లలో హాలీవుడ్ స్థాయి ఫెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించాడు.
యాక్షన్ సీన్లతోపాటు కత్రినాతో హాట్ హాట్ గా రొమాన్స్ చేశాడు. యాక్షన్
హీరోగా హృతిక్ తన సత్తాను మరోసారి సినీ ప్రేక్షకులకు రుచి చూపించాడు.
ధూమ్-3 చిత్రంలో గ్లామర్ తో అదరగట్టేసిన కత్రినా 'బ్యాంగ్ బ్యాంగ్' లో
ప్రదర్శించిన అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. హృతిక్ తో లిప్
లాక్, యాక్షన్, రొమాంటిక్ సీన్లలోనూ కత్రినా విజృంభించింది. పెద్గగా
యాక్టింగ్ కు స్కోప్ లేకపోవడం, గ్లామర్ తోనే కత్రినా సంతృప్తి పరిచింది.
ముగింపు:
కథ లేకుండా కేవలం హృతిక్ ఇమేజ్, కత్రినా గ్లామర్, యాక్షన్ సీన్లే ఈ
చిత్రంలో కీలక అంశాలు. తెరపై హృతిక్ రోషన్ మాయాజాలం డాన్సు రొమాన్స్ పోరాటాలు బాగా చూపించారు కానీ కథ పరంగా పెద్దగా మనం ఆశించినట్టుగా ఉండదు. హృతిక్ రోషన్ ఫాన్స్ కు మాత్రం పెద్ద పండగ.
0 comments:
Post a Comment