హీరో రణవీర్‌సింగ్ బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను ‘స్వీటా’ అంటూ‘ముద్దు’గా
పిలుచుకొంటున్నాడు . వీరి తాజా సినిమా ‘కిల్ దిల్’. ఈ
చిత్రం షూటింగ్ సమయంలో పరిణీతిని ‘స్వీటా’ అంటూ పిలిచేవాడట. వీరిద్దరూ కలసి
పనిచేయడం ఇది రెండోసారి. రణవీర్ అలా కొత్తగా పిలుస్తోంటే... అంతే ఇదిగా
ముచ్చటపడిపోతోందట ఈ సుందరి. షూటింగ్ స్పాట్‌ను ఓ పిక్నిక్ స్పాట్‌లా
జోకులు, కేకులతో కావల్సినంత ఉల్లాసంగా గడిపేశారట వీరిద్దరూ. కానీ పరిణీతికి
ఇంత ‘స్వీట్’ పేరు పెట్టినట్టు చాలామందికి తెలీదట!
0 comments:
Post a Comment