Wednesday 1 October 2014

చిరంజీవితో 150వ సినిమాకు వి.వి.వినాయక్?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలన్న కోరిక ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టాడు. అందుకు సరైన కథ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు.
మహేష్ బాబు హీరోగా వచ్చే ఏడాది ఓ సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మరో ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీసే యోచన ఉందన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్స్ 2 కూడా తీయనున్నట్లు చెప్పాడు.  భూ విక్రయానికి సంబంధించిన పని మీద వినాయక్ రావటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అతడిని చూసేందుకు, కలిసి ఫోటోలు తీయించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు.

0 comments:

Post a Comment