Wednesday 17 September 2014

నటి ఇంద్రజ బుడుగుతో పునరాగమనం

చాలాకాలం విరామం తర్వాత సీనియర్ నటి ఇంద్రజ వెండితెరపై పునరాగమనం చేసింది. ఆమె ప్రత్యేక పాత్రలో తెరకెక్కిన చిత్రం బుడుగు. మంచు లక్ష్మి, శ్రీధర్‌రావు, బాబు, బేబీ డాలి, ఇందు ఆనంద్, సన ప్రధాన పాత్రల్ని పోషించారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మన్మోహన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ పిల్లలపై ఒత్తిళ్లు పెరిగితే వారు ఎలాంటి అయోమయానికి గురవుతారన్నదే చిత్ర ఇతివృత్తం. ఎనిమిదేళ్ల పిల్లాడికి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురైతే అతడు ఏం చేస్తాడు? అతడి కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? అన్న అంశాల సమాహారంగా కథ సాగుతుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాం. పిల్లల నేపథ్యంలో తీస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి ముందుగా సైకాలజిస్ట్‌ల సలహా తీసుకోవడం జరిగింది అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేటివ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, నిర్మాతలు: భాస్కర్, సారిక శ్రీనివాస్.

0 comments:

Post a Comment