Wednesday 17 September 2014

2000 కేంద్రాల్లో ఆగడు

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆగడు. శ్రీను వైట్ల దర్శకుడు. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకొస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ మహేష్‌బాబుతో మా సంస్థ చేసిన మూడో చిత్రమిది. ప్రపంచవ్యాప్తంగా 2000 కేంద్రాల్లో విడుదల చేయబోతున్నాం.

అమెరికాలో 159, ఉత్తర భారతదేశంలో 110 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో మహేష్‌బాబు సర్కిల్ ఇన్సెక్టర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపిస్తారు. ఎవరూ ఆపలేని పోలీసాఫీసర్‌గా ఆయన పాత్ర చిత్రణ శక్తివంతంగా వుంటుంది. శ్రీనువైట్ల శైలి వినోదం అలరిస్తుంది. శృతిహాసన్ ఐటెంసాంగ్ ప్రధానాకర్షణగా వుంటుంది. తమన్ అందించిన ఆడియో పెద్ద హిట్ అయింది. బళ్లారి, స్విట్జర్లాండ్, లడఖ్, ముంబయ్‌లో తీసిన పాటలు కన్నులపండువగా వుంటాయి.

ద్వితీయార్థంలో బ్రహ్మానందం చక్కటి వినోదాన్ని పంచుతాడు. రాజేంద్రప్రసాద్ సెంటిమెంట్‌తో కూడిన ప్రత్యేక పాత్ర చేశారు. శ్రీనువైట్ల పంథాలో డిజైన్ చేసిన కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. తొలికాపీ చూసి సినిమా పట్ల మహేష్‌బాబు చాలా సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆగడు మా సంస్థలో మరో హిట్ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకముంది అన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, తనికెళ్ల భరణి, సోనూసూద్, ఆశిష్‌విద్యార్థి, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: తమన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, రచన: ఉపేంద్ర మాధవ్, అనిల్ రావిపూడి, రచనా సహకారం: ప్రవీణ్‌వర్మ, ఫైట్స్: విజయ్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

0 comments:

Post a Comment