‘జీనియస్’ చిత్రంతో దర్శకునిగా మారిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓంకార్...
దర్శకునిగా తన ద్వితీయ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తన తమ్ముడు అశ్విన్
కథానాయకునిగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. హారర్
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘రాజుగారి గది’ అనే
టైటిల్‌ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ ప్రముఖ టీవీ చానల్
సౌజన్యంతో ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్
వర్క్ జరుగుతోందని వినికిడి. వచ్చేనెల తొలివారంలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ
చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి
ఉంది.
0 comments:
Post a Comment