Tuesday 2 September 2014

పవన్ కొడుకు అకీరా గెస్ట్ రోల్

పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ త్వరలో మనకు పెద్ద తెరపై కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్ మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్' అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా రేణు దేశాయ్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత కూడా రేణునే. ఆ సినిమాలో అకిరా నందన్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా తెలియచేసింది.రేణు దేశాయ్ ట్వీట్ చేస్తూ... ‘అకిరా నందన్ ‘ఇష్క్ వాలా లవ్' సినిమాలో గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. నా కుమారుడి తొలి సినిమా నా స్వీయ దర్శకత్వంలో తెరకేక్కడం చాలా సంతోషంగా ఉంది' అంటూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ తన ఆనందాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా మరాఠీ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. తెలుగులో కూడా ‘ఇష్క్ వాలా లవ్'ను డబ్ చేస్తున్నట్టు గతంలో రేణు దేశాయ్ వెల్లడించారు.

0 comments:

Post a Comment