Tuesday, 2 September 2014

ఎస్‌బీహెచ్ కొత్త పథకం "వృద్ది 275 డేస్"

హైదరాబాద్: దేశీయ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మరో కొత్త డిపాజిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం పేరు ఎస్‌బీహెచ్ "వృద్ది 275 డేస్". ఏడాది లోపు కాలం పాటు నగదు దాచుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుందని... అధిక వడ్డీ రేటుతో పాటు ఎప్పుడైనా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఈ పథకంలో ఉందని ఎస్‌బీహెచ్ తెలిపింది. 275 రోజుల కాలపరిమితి కలిగిన ఈ డిపాజిట్ పథకం ఈరోజు (మంగళవారం, సెప్టెంబర్ 2) నుండి అక్టోబర్ 31 వరకూ నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్లపై ఎస్‌బీహెచ్ 9 శాతం వార్షిక వడ్డీ రేటు చెల్లిస్తుంది. కస్టమర్స్ కనీసంగా రూ. 10,000 గరిష్టంగా రూ. 99,99,000 డిపాజిట్ చేయెుచ్చు. ఈ డిపాజిట్‌‌పై రుణం, ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాలు కూడా ఉంటాయని ఎస్‌బీహెచ్ తెలిపింది. ఈ డిపాజిట్ పథకం వల్ల వినియోగదారులకు చాలా ప్రయోజనాలున్నాయి. ఎటువంటి పెనాల్టీ చెల్లించకుండా 7 రోజుల వ్యవధిలో మీ డబ్బుని తిరిగి తీసుకోవచ్చు.

0 comments:

Post a Comment